శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వేసవి సెలవులు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు.

ప్రముఖ శైవక్షేత్రమైనశ్రీకాళహస్తీశ్వరాలయం లో ఆదివారం భారీగా భక్తులు తరలివచ్చారు. వేసవి సెలవుల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించారు. మొత్తం సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

దర్శన టిక్కెట్ల ద్వారా రూ.500 అంతరాలయ దర్శనంలో 212 మంది, రూ.200 శీఘ్ర దర్శనంలో 761 మంది, రూ.50 ప్రత్యేక దర్శనం ద్వారా 556 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

అదేవిధంగా రాహుకేతు పూజల కోసం రూ.500 టిక్కెట్ల ద్వారా 3,369 మంది, రూ.750 టిక్కెట్ల ద్వారా 1,239 మంది, రూ.1,500 టిక్కెట్ల ద్వారా 392 మంది, రూ.2,500 టిక్కెట్ల ద్వారా 266 మంది, రూ.5,000 టిక్కెట్ల ద్వారా 144 మంది భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.

ఇక ఆలయంలో విక్రయించిన ఐదు రకాల ప్రసాదాలు కలిపి మొత్తం 22,538 ప్రసాదాలు అమ్ముడైనట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ఫోటో క్యాప్షన్: శ్రీకాళహస్తీశ్వరాలయంలో దర్శనం కోసం బారులు తీరిన భక్తులు.