వేసవి సెలవుల నేపథ్యంతిరుమల తిరుపతి దేవస్థానంలో వద్ద భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో సర్వదర్శనానికి 20 నుంచి 24 గంటల వరకు సమయం పడుతోంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఈ నేపథ్యంలో భక్తులకు ఊరట కలిగించేలా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సర్వదర్శనం టోకెన్ ఉన్న భక్తులకు ప్రత్యేకంగా రీ-ఎంట్రీ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా భక్తులు తాత్కాలికంగా క్యూలైన్ నుంచి బయటకు వెళ్లి విశ్రాంతి తీసుకుని, నిర్ణయించిన సమయానికి తిరిగి క్యూలో చేరే అవకాశం ఉంటుంది.
'
రీ-ఎంట్రీ సదుపాయం ఎలా పొందాలి?
ముందుగా సర్వదర్శనం క్యూలైన్లో ప్రవేశించాలి
వైకుంఠం-2లో ఆధార్ కార్డు చూపించి టోకెన్ తీసుకోవాలి
బయటకు వెళ్లాలనుకునే భక్తులకు 17వ కంపార్ట్మెంట్ వద్ద రీ-ఎంట్రీ పాస్ ఇస్తారు
బయటకు వెళ్లే సమయంలో టోకెన్ తప్పనిసరిగా స్కాన్ చేయించాలి
అనంతరం గదులకు వెళ్లి విశ్రాంతి తీసుకోవచ్చు లేదా తిరుమలలోని ఇతర ప్రదేశాలను సందర్శించవచ్చుటీటీడీ కేటాయించిన సమయానికి 15-20 నిమిషాల ముందుగానే చేరుకోవాలి
లడ్డూ కౌంటర్ల వైపు కాకుండా మ్యూజియం పక్కనున్న W-4 గేట్ ద్వారా వెళ్లాలి
అక్కడ ఏర్పాటు చేసిన రీ-ఎంట్రీ కేంద్రంలో టోకెన్ చూపించి లోపలికి వెళ్లాలి
కంపార్ట్మెంట్లు తెరిచిన తర్వాత సాధారణంగా 2-4 గంటల్లో స్వామివారి దర్శనం పూర్తవుతుంది
భక్తులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
టోకెన్‌ను తప్పనిసరిగా భద్రంగా ఉంచుకోవాలి
టోకెన్ పోతే రీ-ఎంట్రీకి అనుమతి ఉండదు
మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు దర్శనానికి అనుమతించరు
గేట్ వద్ద లగేజీ డిపాజిట్ కౌంటర్లు ఉండవు
కాబట్టి వస్తువులను ముందుగానే గదుల్లో లేదా లగేజీ కౌంటర్లలో భద్రపరచాలి
భక్తుల ఇబ్బందులను తగ్గించేందుకు టీటీడీ తీసుకొచ్చిన ఈ కొత్త రీ-ఎంట్రీ విధానం ప్రస్తుతం మంచి స్పందన పొందుతోంది.